
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ జన్మదిన వేడుకలు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలతో పాటు హోమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఢిల్లీతో పోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఏదోరకంగా ప్రభుత్వ సాయం అందేలా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని గెలుపొందారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మరోసారి కెసిఆర్ పాలన కోసం ఎదురు చూస్తుందని, రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపడుతుందని ఆశాభావాని వ్యక్తం చేశారు. కాగా కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి శాలినిరెడ్డి, కూతురు శ్రీనికరెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, రాష్ట్ర నాయకుడు వీ రవీందర్ రావు, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యంరాజు, ముక్క రమేష్, వి కిషన్, కుమార్ యాదవ్, కేసిరెడ్డి లావణ్య, రమాదేవి, కొండ్ర నరేష్, ప్రతాప కృష్ణ, ఇమ్రాన్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రవీందర్ రావు ఆధ్వర్యంలో ఉదయం వాకర్స్ అసోసియేషన్ సమక్షంలో క్రీడామైదానంలో మొక్కలు నాటారు, కేక్ కట్ చేశారు. స్థానికులకు కేకలు, స్వీట్లు పంచిపెట్టారు.
కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సుదర్శన హోమం.
కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితులచే మంత్రోచ్ఛరణల మధ్య పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. అలాగే కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.






