
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :సైదాపూర్ మండలం వెన్నంపల్లి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు డి.ఈ.ఓ. సిహెచ్ విఎస్ జనార్దన్ రావు వెన్నంపల్లి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం వంట వండుతున్నారా అని మిడ్ డే మీల్స్ వర్కర్స్ ను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ సమావేశాలలో భాగంగా ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఐ .ఎఫ్ బి ప్యానెల్ బోర్డులను పాఠశాలలో వినియోగించి విద్యార్థులకు లేటెస్ట్ టెక్నిక్స్ ను ఉపయోగిస్తూ ఉత్తమ విద్యాబోధన సాగించాలని కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి మరియు మండల విద్యాశాఖ అధికారి కే శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. ప్రభాకర్ రెడ్డి, ఇంగ్లీష్ ఆర్పీలు వి ప్రవీణ్ కుమార్, సరిత, బి తిరుపతిరెడ్డి. పవన్ కుమార్ మరియు కాంప్లెక్స్ పరిధిలోని హుజురాబాద్ మరియు సైదాపూర్ మండలాల అన్ని పాఠశాలలలోని ఆంగ్ల భాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



