
–ఆచంద్రార్కం ఆయన ఎప్పటికీ ప్రజల మనిషే
– లేచిన కెరటంలా ఆయన గొప్ప పోరాట యోధుడు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిష్కర్త కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు.
– ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు
పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దాదాపు 140 కోట్ల మంది భారతీయుల దృష్టిని ఆకర్షిస్తూ సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ జాతివిముక్తి కోసం,ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సకల జనులను ఏకం చేసి రేయింబవళ్లు పోరాడిన చరిత్ర పురుషుడు ఒక్క కేసీఆర్ మాత్రమేనని… ఆయన మార్గదర్శకత్వంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరిగిందని…జాతి యావత్తుకు ఈ విషయం తెలుసునని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడైన పోరాడి రామారావు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి…ప్రత్యేక తెలంగాణ సృష్టికర్త అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అనేక ఉద్యమాలను పరిశీలించినట్లయితే ఒక్క తెలంగాణ ఉద్యమమే యావత్ దేశాన్ని కదిలించిందని…తెలంగాణ ప్రాంతానికి చెందిన దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కథన రంగంలోకి దూకడం సాధారణమైన విషయం కాదని…తెలంగాణ ఉద్యమ చరిత్ర…ఈ చరిత్ర ఉన్నంతవరకు సజీవంగా ఉంటుందని పోలాడి రామారావు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్ర సాధన ద్యేయంగా, తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉమ్మడి పాలకులు ఇచ్చిన పదవులను తృణ ప్రాయంగా వీడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించి తన వాగ్ధాటి తో ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. అహింస పరమో ధర్మః అన్న నాటి పెద్దల నానుడిని ఆదర్శంగా తీసుకుని అహింసా మార్గంలో పోరాటం చేసి ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ సచ్చుడో… అనే నినాదంతో మలిదశ ఉద్యమానికి తెరతీసి దాదాపు 14 సంవత్సరాల పాటు కోట్లాది మంది తోఉవ్వెత్తున ఉద్యమాన్ని కొనసాగించి ప్రపంచ దేశాలను సైతం కదిలించి, జాతీయ స్థాయిలో ఉద్యమానికి మద్దతు తెచ్చి నాటి పాలకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన రాజకీయ మేధావి కేసీఆర్ అని పోలాడి రామారావు అన్నారు.
తెలంగాణను తమ కామదేనువుకా భావించిన సీమాంధ్ర పాలకుల కుట్రల కుతంత్రాలతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలను వమ్ము చేస్తూ, సమర్ధంగా తిప్పికొట్టి తిరుగులేని విజయాన్ని సాధించిన గొప్ప పోరాట యోధుడు కెసిఆర్ అంటూ పోలాడి కీర్తించారు. ఢిల్లీ పాలకులను గడగడలాడించే క్రమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తనదైన రీతిలో కెసిఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడంతో తప్పనిసరి పరిస్థితులలో దిగివచ్చిన అప్పటి యూపీఏ పాలకులు 2014లో ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆశలను సహకారం చేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపడం చరిత్రలో మరచిపోలేని సంఘటనగా పోలాడి రామారావు అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా పదేళ్లపాటు రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ మొన్నటి ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ… తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన గొప్ప యోధునిగా యావత్ తెలంగాణ సమాజం గుర్తించుకుంటుందని రామారావు పేర్కొన్నారు. తన పాలనలో వృద్ధులకు… వితంతువులకు… వికలాంగులకు… ఒంటరి మహిళలకు… వ్యవసాయదారులకు…. గర్భిణీ స్త్రీలకు… విద్యార్థిని విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సేవలు మరువలేనివని పోలాడి గుర్తు చేశారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న దశలో కెసిఆర్ అధికారం కోల్పోవడం బాధాకరమే అయినప్పటికినీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని , ఇందుకు ఉదాహరణగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా 9 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు విశేష కృషి చేసి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు ఓటమి చెందడం అని మళ్ళీ రాష్ర్ట విభజన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి గా చంద్రబాబుపగ్గాలు చేపట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి విశేషంగా కృషి చేసి ఘోరంగా ఓటమి పాలై మళ్ళీ భారీ మెజారిటీ తో ఏపీ సీఎం గా చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు . అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు…తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు వస్తాయని…కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ప్రజల మధ్యన మళ్లీ మళ్లీ జరుపుకోవాలని…ఆయన సేవలు సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ప్రజలకు లభించాలని పోలాడి రామారావు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

