
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ – పాపయ్యపల్లి గ్రామాల మధ్య రైల్వే పట్టాల పక్కన ఓ యువతి, యువకుడి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. అయితే వారు ప్రేమ జంట ఆయుంటందని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరైనా వారిని చంపి పట్టల పక్కన పడేసి ఉంటరా లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియడం లేదు. కాగా ఏసిపి శ్రీనివాస్ జీ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. వారి పూర్తి వివరాలఖై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


