
స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్ మార్చి1:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసిల సంక్షేమం కోసం జాతీయస్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతు గిట్టు బాటు ధర పై ప్రత్యేక చట్టం తీసుకు రావాలని, రైతు భీమా వయోపరిమితిని 70ఏళ్లకు పెంచాలని పలు డిమాండ్లతో ఫిబ్రవరి 23న దేశ రాజధాని డిల్లీలో జాతీయస్థాయి భారీ మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చామని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి తెలిపారు. ధర్నాలో పాల్గొని విజయవంతం చేసి ఆదివారం హన్మకొండకి చేరుకున్న పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలకు ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఓసి ఐకాస నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం నాయకులతో కలిసి విలేకరులతో పోలాడి రామారావు, జైపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా పటిష్టంగా సంపూర్ణంగా అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ అర్హతకు ఒక జారీ చేసే సర్టిఫికెట్ ఎలాంటి నిబంధనలు లేకుండా 5ఏళ్ల వరకు వర్తింప చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయ పరిమితిని విధించాలన్నారు. రైతుభీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతుల భాగస్వామ్యం ఉండే ప్రత్యేక రైతు చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన జాతీయ స్థాయి భారీ మహా ధర్నాలోని డిమాండ్లను అనంతరం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరెంతవరకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు.
ప్రభుత్వాలకు ఆరు నెలల గడువు ఇస్తున్నామని తక్షణమే డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. మా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలుపని రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో పట్టు బట్టి ఓడిస్తామని తమ సత్తా ఏంటో చూపిస్తామని పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డినీ పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డిలు కలిసి తమ న్యయమైన డిమాండ్ల సాధనకు అన్ని విధాలుగా సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపూతున్న దృశ్యం.
అంతకు ముందు వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డినీ పోలాడి రామారావు , గోపు జైపాల్ రెడ్డిలు కలిసి తమ న్యయమైన డిమాండ్ల సాధనకు అన్ని విధాలుగా సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపి సన్మానించి డిల్లిలో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి మహాధర్నాలో చేసిన డిమాండ్లను రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించారని , త్వరలో సిఎం రేవంత్ రెడ్డి వద్దకు జేఏసీ నాయకులను తీసుకెళ్ళి కల్పిస్తానని న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని స్పష్టం మైన హామీ ఇచ్చారని అందుకు ఓసి జేఏసీ తరపున నాయిని రాజేందర్ రెడ్డికి ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.
వచ్చే రెండు వారాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో 15 మంది సభ్యుల బృందం కలవడానికి అపాయింట్ మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రామారావు ప్రకటించారు. తమ బృంద సభ్యులు ఈనెల 9న ఢిల్లీకి ప్రయాణ ఏర్పాట్లు జరుగుతున్నాయని 5రోజులు అక్కడే ఉండి తమ డిమాండ్ల పరిష్కారానికి పలువురు కేంద్ర మంత్రులను కలువ బోతున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఐకాస రాష్ట్ర ప్రథాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, సలహాదారు రావుల నరసింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, కోశాధికారి, ఉమ్మడి జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, ఉమ్మడి జిల్లా కమ్మ సంఘం అధ్యక్షుడు రాయపాటి వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు ఆరుట్ల లోకమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డిలను సత్కరిస్తున్న వరంగల్ జిల్లా జేఏసీ నాయకులు





