
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల జరిగిన వివిధ ఎన్నికల్లో విజయం సాధించిన కుమ్మరి కులస్తుల ప్రజా ప్రతినిధులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపూర్ లో సన్మానం జరిగింది. హుజురాబాద్ మునిసిపల్ 24వ వార్డ్ కౌన్సిలర్ గా ఎంపికైన బోర్నపల్లికి చెందిన నాంపల్లి శ్రీనివాస్, సింగాపూర్ గ్రామ వార్డ్ సభ్యుడు ఇజ్జిగిరి శ్రీనివాస్‌లను పూలమాలలు, శాలువాలతో సత్కరించీ జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… హుజురాబాద్ పట్టణంలో కుమ్మర్ల భవనం నిర్మాణం, మౌలిక వసతుల సమస్యలుపై పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. హుజురాబాద్ పట్టణంలోని అంగడి సెంటర్ ప్రాంతంలో కుమ్మర్లు తమ కుండలు, మట్టివస్తువులు అమ్ముకునేలా ప్రత్యేక స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కుమ్మరి కులస్థూల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షుడు ఇజ్జిగిరి బిక్షపతి, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యుడు ఇజ్జిగిరి శ్రీనివాసును సన్మానిస్తున్న కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు..





