
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట గలిపారని, ఇలా అనేక రకాలుగా దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన బిఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మను పిసిసి ఆదేశాలతో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరియు జగదీశ్వర రెడ్డి ల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోల్లు బాబు, సందమల్ల బాబు, ఆలేటి సుశీల, ఏర్ర రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బండారి సదానందం, దుబాసి బాబు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు జుపాక సంపత్, గడ్డం రాఘవేంద్ర, గంటా కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల రాజు కుమార్, సందీప్, ఉమాపతిరావు, తాళ్ళపెళ్లి రమేష్, తిరుపతి, యండి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
