
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ హై స్కూల్లో శనివారం
మాదక ద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ…విద్యార్థులు ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకూడదని అన్నారు. చెడు వ్యసనాలకు అలవాట్లకు బానిసైతే జీవితం నాశనం అయిపోతుందని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎవరైనా ఒత్తిడి చేసిన నో చెప్పాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రములో ఎక్సైజ్ ఎస్సై బి. జుమ్ లాల్ కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ ముకుంద రెడ్డి, కానిస్టేబుళ్లు సంతోష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.






