
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): టీజీ ఎన్పీడిసియల్ హుజురాబాద్ సబ్ డివిజన్ డిఈ కే ఉపేందర్, టెక్నికల్ ఏడిఈ శ్రీనివాస్, సైదాపూర్ ఏఈ కె శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో సోమవారం సైదాపూర్ మండలం ఎలబోతారం, చింతలపల్లి గ్రామాలలో రైతులతో కలిసి పొలం బట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రైతుల పోలం దగ్గర జరుగు విద్యుత్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. వారి సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు. అలాగే మోటార్ల వద్ద కెపాసిటర్లు వాడడం వలన వచ్చు ప్రయోజనాలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. రైతులందరు కెపాసిటార్లు బిగించకొని సంస్థ అభివృద్ధికి తోడ్పడలన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎటువంటి సమస్యలున్న మా సిబ్బందికి తెలయచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, లైన్ మెన్ టి అమర్నాథ్, ఎలా బోతారం, చింతలపల్లి గ్రామంలోని రైతులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
