
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హోలీ పండుగ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు. హోలీ పండుగని పురస్కరించుకుని గురువారం వాహన తనిఖీల్లో భాగంగా ఆయన మాట్లాడారు. హోలీని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హోలీ పూర్తి అయిన అనంతరం కాలువలోకి బావుల, లోతుగా ఉన్న కెనాల వద్దకి వెళ్లకూడదని ఆయన సూచించారు. పోలీస్ యంత్రాంగం హోలీకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇతనికిలో ఎస్సైలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు.



