
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కాల్వ శ్రీరాంపూర్): పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయురాలు కోయల్ కార్ స్వప్న అధ్యక్షతన పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్, కాంప్లెక్స్ హెచ్ ఎం నరెడ్ల సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయురాళ్లు పాఠశాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు బాలబాలికలను క్రమం తప్పకుండ బడికి పంపించాలని, హాజరు శాతం పెంచాలని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయుని బృందం 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను వితరణ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు ఎం మాధవి, సి హెచ్ శైలజ, సిహెచ్ భారతి, ఏఏపిసీ ఛైర్మెన్ ఓ శ్రీజా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


