
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: టియుడబ్ల్యూజే (ఐ జేయు) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా గెలుపొందిన కాయిత రాములు, కామని రవీందర్ లను హుజురాబాద్ లోని ఎంపీడీవో కార్యాలయంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ కమిటీల అధ్యక్షులు ఎండి ఖాలీద్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్, రొంటాల సుమన్ ల ఆధ్వర్యంలో జరుగగా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా కాయిత రాములు , కామని రవీందర్ లు గెలుపొందడం హర్షణీయమన్నారు. పాత్రికేయులు సమాజంలో జరిగే సమస్యల పట్ల తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగు తీసి పాత్రికేయులు ప్రజల పక్షాన నిలబడడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు మాట్లాడుతూ..తనకు గతంలో కంటే ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని, సమాజంలోని వివిధ అంశాలపై వార్తలు ప్రచురించడంతోపాటు జర్నలిస్టుల సమస్యలను కూడా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన నివేషన స్థలాల కోసం ముందుండి పోరాడుతానని, అందుకు అందరి సహకారం ఉండాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే పాత్రికేయులు నేడు కడు దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నివేషన స్థలాల కోసం పోరాడే విధి విధానాలు కూడా తెలియజేస్తామన్నారు. తమ నివేషన స్థలాలు సాధించుకునే విషయంలో జరిగే పోరాటంలో ప్రజా సంఘాల నాయకులు తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తమపై ప్రేమతో ప్రజాసంఘాలు, జెఎసి, కుల సంఘాలు ఐక్యతగా వచ్చి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జేఏసీ అధ్యక్షులు ఆవునూరు సమ్మయ్య, ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మర్త రవీందర్, కొలిపాక సమ్మయ్య , శివ దయాల్ సింగ్ ,పాక సతీష్, సొల్లు బాబు, వేల్పుల ప్రభాకర్, సందెల వెంకన్న, తులసి లక్ష్మణమూర్తి, ఇల్లందుల సమ్మయ్య, చిలకమారి శ్రీనివాస్, సంగేమ్ సత్యనారాయణ, బింగి కరుణాకర్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, కె.ఆర్ బిక్షపతి, మాచర్ల నరేష్, సబ్బని రాజేందర్, కాజీపేట శ్రీనివాస్, రావుల రాజేష్, దాట్ల ప్రభాకర్, రొంటాల సమ్మయ్య, ఎర్ర రాజకుమార్, రేగుల అశోక్, బావు తిరుపతి, గంగిశెట్టి జగదీశ్వర్, మొలుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








