Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 23ః పట్టణంలోని నాగార్జున పాల డైరీ యాజమాన్యం ఔదార్యం చాటుకుంది. తమ సంస్థలో పనిచేసే దాదాపు 150 మంది ఉద్యోగులకు వాసన్ ఐ కేర్ హాస్పటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు మాట్లాడుతూ.. కంటి సమస్యలు ఉన్నవారికి డైరీ సౌజన్యంతో ఆపరేషన్లకు గానీ, అద్దాలకు గానీ 20 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఈఎస్ఐ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఏజీఎం ఆకునూరి సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రమాదబీమాతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు డైరీలో మెడికల్ కిట్ అందుబాటులో ఉంచి, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో క్రిష్ణ ప్రసాద్, ప్లాంట్ మేనేజర్ మాటూరి శ్రీనివాస్, క్వాలిటీ మేనేజర్ బీ శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






