
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీనియర్ జర్నలిస్టు చిర్ర సుదర్శన్ (55) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. హుస్నాబాద్ లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న గ్రామంలో బీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కందకంలో పడి మృతి చెందినట్లు వారు తెలిపారు. ఎలుకతుర్తి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన చిర సుదర్శన్ గత పది హేను సంవత్సరాలుగా హుజురాబాద్ కేంద్రంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మృతి చెందిన పాత్రికేయుని కుటుంబ సభ్యులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబ సభ్యులను టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్ లతోపాటు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, జర్నలిస్టులు మండల యాదగిరి, గూడూరి కొండాల్ రెడ్డి, కుడితాడి బాబురావు, సురకంటి తిరుపతిరెడ్డి, కేసిరెడ్డి నర్సిహ్మరెడ్డి, ఆల్లి నరేందర్, నంబి భరణికుమార్, మాక్సుద్, బొడ్డు శీను, ముష్కి శ్రీనివాస్, మాచర్ల రాజుగౌడ్, నిమ్మటూరి సాయికృష్ణ, వేల్పుల సునీల్ కుమార్, కేదాసి శ్రీధర్, టేకుల సాగర్, సమ్మెట సతీష్, తాటిపాముల దేవేందర్, కుడికాల సాయిలు, నాగవెల్లి రాజు, మంతెన కిరణ్, చిర్ర కిషన్, గోస్కుల రాజు తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి చేశారు.

మృతుడు సుదర్శన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న జర్నలిస్టు సంఘం నాయకులు..

మృతుడు చిర్ర సుదర్శన్ (ఫైల్)