
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
గ్రామాభివృద్ధి కోసం తమకు నిధులు కేటాయించాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామస్తులు సోమవారం తెలంగాణ బీసీ సిటిజన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు పోతిరెడ్డిపేట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవునూరి కిరణ్ కుమార్, కంకణాల పరుశరాములు గ్రామ అభివృద్ధి కొరకు వినతి పత్రం అందజేశారు. లింగాపురం నుండి మాచినపళ్లి వరకు తమ గ్రామం నుండి గతంలో మట్టి రోడ్డు మంజూరు కాగా దానిని బిటిగా మార్చాలని,
పోతిరెడ్డిపేట నుండి కనపర్తి గ్రామం వరకు నూతనబీటీ రోడ్డు మంజూరీ చేయాలని కోరగా కేంద్రమంత్రి సంజయ్ పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, తెలంగాణ బీసీ సిటిజన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ , బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, మండల అధ్యక్షులు రావుల కుమార్, మాజీ సర్పంచ్ చందుపట్ల పరందములు, మాజీ ఎంపీటీసీ నరుకుడు సామెల్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు దేవునూరి రవీందర్, కాలేశ్వరం సాల్ మో న్, చొల్లేటి మల్లారెడ్డి, చెన్నోజు భద్రయ్య, నందిపేట పరమేశ్వర్, మంతెన సురేందర్, పోచంపల్లి సమ్మయ్య,దేవునూరి బాబు, మామిడి రమేష్ గూళ్ళ శ్రీనివాస్ పొడి శెట్టి రాజు అయిలి సతీష్,జూపాక అమరేంద్ర చారి, బొలెవేని రాజు, కంకణాల కుమార్, కంకణాల సదానందం తదితరులు పాల్గొన్నారు.



కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి వినతిపత్రం అందజేస్తున్న పోతిరెడ్డిపేట గ్రామస్తులు..