
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ కు చెందిన చిన్నక్క మల్లారెడ్డి తన తండ్రి చిన్నక్క పాపిరెడ్డి జ్ఞాపకార్థం శాలపల్లి ఇంద్ర నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు నోటుబుక్స్ అందజేసి ఉదారత చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 నోట్ బుక్స్ మరియు ప్రతి విద్యార్థికి స్టూడెంట్ డైరీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను బాగా చదివి క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలపల్లి పద్మశాలి సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు వీ రమేష్, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ శారద పాఠశాల తరుపున మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులకు నోటుబుక్కులు, విద్యార్థి డైరీలను అందజేస్తున్న చిన్నక్క మల్లారెడ్డి..