
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: యువతకు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగి ఉండాలని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్సై తమ్మిశెట్టి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హైస్కూల్లో, మండలంలోని సింగాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వాటి వల్ల అనేక దుష్ఫలితాలు ఉన్నాయని చెప్పారు. మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. మంచి భవిష్యత్తు నాశనం అవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు ఎలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలోఎక్సైజ్ CI టి శ్రీనివాసులు, SI లు T వినోద్ కుమార్, బి. జుమ్ లాల్, బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు రమేష్, పాఠశాల కరస్పాండెంట్ వకులాభరణం వెంకటేశ్వర్లు, పరాంకుశం కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు సతీష్, రమ, షాహిన్, కుమారి, రాజయ్య, ఎక్సైజ్ సిబ్బంది HC ముకుంద రెడ్డి, EC ‘S సంతోష్, శేఖర్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్

విద్యార్థులచే ప్రతిజ్ఞ చేస్తున్న ఎక్సైజ్ అధికారు..

సింగపూర్ పాఠశాలలో అవగాహన కల్పిస్తున్న ఎక్సైజ్ అధికారులు..