
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:చేనేత మిత్ర పథకం, యారన్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని హుజురాబాద్ చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సంఘం 71 వ వార్షిక 83వ మహాసభ పర్సన్ ఇంచార్జ్ ఉపేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేతన్న పొదుపు పథకంలో నేత పారిశ్రామికులకు లబ్ధిచేకూరుతుందన్నారు. పెండింగ్ బకాయి డబ్బులను విడుదల చేసి లేదా పారిశ్రామికుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, చేనేత జౌలి శాఖ మంత్రి టి నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 2024 ఆదాయ వివరాలను 2025 ఆదాయ వివరాలను అంచన బడ్జెట్ ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వేముల యాదగిరి, గుండేటి మహాదేవ్, మంచికట్ల వెంకటయ్య, మండల సత్యనారాయణ, కుడికాల ప్రభాకర్, మంచికట్ల సుమలత, మంచికట్ల వాణి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.


వార్షిక మహాసభలో మాట్లాడుతున్న సంఘము అధ్యక్షుడు ఉపేందర్..





