
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో wwf india, నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఎర్హ్ అవర్ కార్యక్రమం నిర్వహించారు. బీసీఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బొట్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ wwf india వారు పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని తగ్గించడం కొరకు ప్రతి సంవత్సరం మార్చ్ 22న ఒక గంట పాటు అనవసరమైన విద్యుథ్, ఎలక్ట్రానిక్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేయడం అనే కార్యక్రమాన్ని 2007 నుండి కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇలా స్విచ్ ఆఫ్ చేయడం సహజ వనరుల సంరక్షణ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు మరియు బీసీఐ సిబ్బంది పాల్గొన్నారు.


హైస్కూల్ క్రీడా మైదానంలో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహిస్తున్న వాకర్స్, పర్యావరణ ప్రేమికులు..





