
Oplus_131072
–ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని గుర్తుంచుకోండి
–నేను మాట్లాడే ప్రతి మాట నా గొంతు కాదు రైతుల గొంతు
–మత్స్యకారులతో గొల్ల కురుమల సోదరులను ప్రభుత్వం విస్మరించింది
–కెసిఆర్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తక్కువే
,-అసెంబ్లీ సమావేశాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎద్దు ఏడ్చిన యువసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలోని రైతులందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు అన్ని విషయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గత ఏడాది బడ్జెట్లో వ్యవసాయానికి 72,652 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 24, 439 కోట్లు మాత్రమే వ్యవసాయానికి కేటాయించారని, తెలంగాణ రైతులు ఏం తప్పు చేశారని 50 వేల కోట్లు తప్పు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిఎస్టిపి 12% నుంచి 10% పడిపోయిందని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న 2,00,000 రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశం అయినప్పుడు 49 వేల కోట్లు అవసరం ఉంటాయని చెప్పి, చివరకు 20000 కోట్ల వరకు మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. తన సొంత నియోజకవర్గంలో కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని కొన్ని గ్రామాల్లో 50% కూడా పూర్తి కాలేదన్నారు. భారతదేశానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే రైతు ఎలా ఉంటాడో అనేది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించాడని చెప్పారు. 2014లో 34 లక్షల 90 వేల సాగు విస్తీర్ణం ఉంటే 2024 వచ్చేసరికి కోటి 18 లక్షల పదివేల సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. పత్తి విస్తీర్ణం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 2014 కు ముందు పోలిస్తే రెండింతలు పెరిగిందని, ధాన్యం కొనుగోలులో కూడా దేశంలోనే మేటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడిందన్నారు. రైతుల తరసర ఆదాయం 2014న లక్ష పైచిలుక ఉంటే 2024 కల్లా మూడు లక్షల పై చిలుకు పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు ఏదీ పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తుందో ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వాగు దాటిదాకా ఓడ మల్లన్న వాగు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం 5 20 కోట్ల వరకు ఖర్చు చేసి 550 కోట్ల చాప పిల్లలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి కారణమయ్యామని గుర్తు చేశారు. 2023లో 82 కోట్లు ఖర్చు చేసి 85,000 కోట్ల చాప పిల్లలను పంపిణీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం 34 కోట్లు ఖర్చుచేసి 34 కోట్ల చేప పిల్లలు మాత్రమే మత్స్యకారులకు పంపిణీ చేయడం బాధాకరమన్నారు. రూ.50 కోట్ల చాప పిల్లలను ఎందుకు తక్కువే వేశారో చెప్పాలన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో పెద్ద చెరువు ఉందని మా ప్రభుత్వంలో మూడు లక్షల చాప పిల్లలు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 1,50,000 చాప బిల్లు మాత్రమే వేశారని అన్నారు. యాదవ, కురుమ సోదరులకు కూడా 82 లక్షల పైచిలుకు గొర్రెలను పంచిన ఘనత కూడా కేసీఆర్ దేనని అన్నారు. బీఆర్ఎస్ పాలన రైతుల పాలిట స్వర్ణ యుగం అయితే కాంగ్రెస్ పాలన రైతుల పాలిట సంక్షోభ యుగంగా తయారైందన్నారు. రైతులకు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.14,000 వేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా 14000 రైతు భరోసా పడలేదన్నారు. రైతులకు రైతు భరోసా కింద బాకీ ఉన్న మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని బోగస్ అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పది వడ్లకు బోనసిస్తానని చెప్పి చివరకు సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చారని, అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ సుమారు రూ .29వేల కోట్ల వరకు చేశారని, దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ డబ్బులు తక్కువేనని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతాంగం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర అసహనంగా ఉన్నారని, రైతుల గొంతుకనై మాట్లాడుతున్నానని అంతేతప్ప వ్యక్తిగతంగా మాట్లాడటం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలోకి ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా అధికారుల చుట్టూ తిరగలేదని, ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా వారి ఎకౌంట్లోకి వెళ్లాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలందరూ కాంగ్రెస్ పార్టీ ఆలంబిస్తున్న తీరుపై విసుకు చెంది ఉన్నారని, దండం పెట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న రైతులను ఆదుకోవాలని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే దాని పర్యవసానం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చవిచూస్తుందని అన్నారు.
