Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:బాల బాలికల అక్రమ రవాణాను అరికట్టి వారి హక్కులను పరిరక్షించాలని పలువురు అధికారులు తెలిపారు. ఈరోజు హుజురాబాద్ లో ఎంపీడీవో ఆఫీసులో మండల బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యము 18 సంవత్సరముల లోపు బాల బాలికల హక్కుల రక్షణ, మెరుగైన సంరక్షణ కోసం బాలల న్యాయ చట్టం 2015ప్రకారం కేంద్ర రాష్ట్రాలతో సంయుక్తంగా దేశమంతా సమగ్ర బాలల పరిరక్షణ పథకమును ప్రారంభించబడిందన్నారు. ఈ పథకము పరిధిలోకి వచ్చు బాలులు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఇంటి నుండి పారిపోయిన నిరాదరణకు గురవుతున్న పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు బాలబాలికల అక్రమ రవాణా, బిక్షగాలుగా మార్చడం కోసం అమ్మడం తరలించడం జరుగుతుందన్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్న బాలలు, బాలికలు, బాల్యవివాహాలు, మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు బానిసైన బాలలు మొదలగు బాలబాలికలందరూ ఈ పథకంలోకి వస్తారని వివరించారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తికాని వారికి బాల్యవివాహాలు చేయడం వల్ల జరిగే అనర్ధాలు గురించి చర్చించారు. బాల్య వ్యవహారాలను ప్రోత్సహించిన ప్రయత్నం చేసిన గాని చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మండల కమిటీ సమావేశానికి తాసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, సిడిపిఓ సుగుణ, ఎంఈఓ శ్రీనివాస్, ఎంపీఓ సతీష్ కుమార్, ఏపీఎం తిరుపతి, ఏఎస్ ఐ కమల, మండల సమైక్య అధ్యక్షురాలు సుజాత, హెల్త్ డిపార్ట్మెంట్ విజేందర్, మైనార్టీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజశ్రీ, శిరీష, పద్మ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి తిరుపతి, సోషల్ వర్కర్ రమేష్, పారా లీగల్ సరిత, మరియు మత పెద్దలు మహేష్, నవీన్ కుమార్ తదితరులు ఈ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.






