
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మార్చి 25: హుజురాబాద్‌కు చెందిన బీజేపీ నాయకుడు నల్ల సుమన్ మానవత్వాన్ని చాటుకుంటూ అత్యవసర రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. హుజురాబాద్ సివిల్ హాస్పిటల్లో డెలివరీ కోసం O నెగటివ్ రక్తం అత్యవసరంగా అవసరమైన సమయంలో, ఆయన జమ్మికుంట బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా నల్ల సుమన్ మాట్లాడుతూ, “రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ ఓ జీవితం కాపాడిన వారవుతారు” అని పేర్కొన్నారు. ఆయన సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, పలువురు నాయకులు, వైద్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.రక్తదానం చేయడమే కాకుండా, రక్తదానంపై అవగాహన పెంచేందుకు బిజెపి నాయకులు నల్ల సుమన్ తరచుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాజ సేవా దృక్పథంతో యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
