Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో విద్యుత్తు మరమ్మతుల పనులు జరుగుతున్నందున పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పట్టణంలోని ప్రతాపవాడ మరియు భూసారవాడ మరియు తెనుగువాడ ఏరియాలలో రేపు అనగా శుక్రవారం ఉదయం 06-00ల నుండి 10-00ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని కావున ప్రజలు గమనించి మాకు సహకరించగలరని విద్యుత్ శాఖ టౌన్ సెక్షన్ అధికారులు విజ్ఞప్తి చేశారు.






