
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (కాజీపేట): హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు కాజిపేట్ రైల్వే స్టేషన్ దగ్గర అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగులు, యాచకులు, బాటసారిలు, ఆకలితో అలమటించే వారికి, రోజువారి కూలీలకు అన్నదానాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లు గంగిశెట్టి జగదీశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లింగయ్య, బుచ్చయ్య, గురుదక్షిణ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ధనలక్ష్మి మరియు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.








