
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:హుజురాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమానికి ప్రవేట్ పాఠశాలలు తమ వంతు సహకారాన్ని అందించాలని హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మార్సీలో ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపాల్ తో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ…స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమం కోసం ఈ నెల 19న హుజురాబాద్ లోని నిర్వహించే చెత్త సేకరణ పారిశుద్ధ్యం పై అవగాహన కోసం ప్రైవేట్ పాఠశాలలు తమ పిల్లలతో పారిశుధ్యం పై ఎగ్జిబిట్లు తయారు చేయించి ప్రదర్శనకు ఉంచాలని పిల్లలకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, హుజురాబాద్ ట్రస్మా అధ్యక్షులు వకులాభరణం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పా రెడ్డి రవీందర్ రెడ్డి కోశాధికారి దాసరి కోటేశ్వర్ యాదవ్ సభ్యులు విన్సెంట్ జార్జ్ పరాకుషం కిరణ్ కుమార్ సి ఆర్ పి అమరేందర్ గౌడ్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ హుజురాబాద్ 2025 కార్యక్రమంలో భాగంగా, తేదీ: 04-04-2025 రోజున పట్టణములోని 3వ వార్డు నందు గల అంగన్ వాడీ కేంద్రాన్ని కమిషనర్ గారు సందర్శించి, కేంద్రము నుండి వెలువడే తడి పొడి చెత్తలను వేరు చేసి, పురపాలక సంఘ వాహనములకు అందించుటకు గాను తెలుపుచూ, తడి పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా, 1st Friday & 3rd Friday కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యాలయ సిబ్బంది వారి గృహముల నుండి వెలువడిన పొడి చెత్తలను సేకరించి, కార్యాలయ ఆవరణలో తూకం వేసి అట్టి పొడి చెత్తను రీసైక్లింగ్ కొరకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమములో చురుకుగా పాల్గొన్న వార్డు అధికారి యం రమాదేవి, సానిటరీ జవాన్ రొంటాల సుధీర్ ని మరియు తడి పొడి చెత్తలను వేరు చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తనవంతు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ని కమిషనర్ సమ్మయ్య శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె. సమ్మయ్య, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, ICDS అధికారి సుగుణ, మునిసిపల్ ఇంజనీర్ శ్రీ జి. సాంబరాజు, టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశ్వినీ గాంధీ, సీనియర్ సహాయకులు MD. రషీద్, జూనియర్ సహాయకులు, వార్డు అధికారులు, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ M. కిషన్ రావు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది & అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలోని ఎమ్మార్సీలో ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపాల్ తో సమావేశం నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..









