
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయంలో హనుమకొండ శరత్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతమైనట్లు లైబ్రేరియన్ కనకలక్ష్మీ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 61 మంది కి నేత్ర పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స అవసరమైన వారికి సూచనలు సలహాలు అందించారు. కొన్ని పరీక్షలు ఉచితంగా వారికి అందించేందుకు కూపన్ లు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొయ్యడ కమలాకర్ గౌడ్, చందుపట్ల జనార్ధన్, వేల్పుల ప్రభాకర్, జగదీశ్వర్, అరుణ్, సహాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం.