
- దేశ హితం కోసం పుట్టిన ఏకైక పార్టీ బిజెపి…
- దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్ల తో బిజెపిని పోల్చడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి…
- కాంగ్రెస్ ను స్థాపించిన బ్రిటిష్ వాళ్లపైన సీఎం కు మమకారం ఎక్కువైంది.
- భవిష్యత్తులో ఇక కాంగ్రెస్ ను అడుగుపెట్టనీయద్దనే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది..
- బిజెపిపై రేవంత్ రెడ్డి చేస్తున్న అహంకార వ్యాఖ్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
- బిజెపి ఎక్కడుందనీ అవహేళనగా మాట్లాడిన గత సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు..
— జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ హితం కోసం పుట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం, బిజెపి పట్ల ప్రజలకున్న విశ్వాసం, నమ్మకంతోనే 44 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు . భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ గావ్ చలో అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం రోజున బిజెపి హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో గావ్ చలో బస్తీ చలో ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిజెపిని అడుగుపెట్టనీయమని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. దేశం కోసం, ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బిజెపిని సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తూ, బ్రిటిష్ వాళ్ళ కంటే బిజెపి ప్రమాదకరమని వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వాళ్లు సీఎం రేవంత్ రెడ్డికి గొప్పవాళ్లుగా కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిన బ్రిటిష్ వాళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువై వారిని కీర్తించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇలాగే గతంలో బిజెపి గురించి హేళనగా మాట్లాడిన కెసిఆర్ కు బిజెపి శక్తి ఏంటో తెలిసి వచ్చి ఆయన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బిజెపి తెలంగాణలోని ప్రతి గడపగడపకు చేరుకొని, ప్రజల గుండెల్లో నిలిచిందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అహంకారంతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 16 నెలల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు విసుగు వచ్చిందని, భవిష్యత్తులో ఇక తెలంగాణలో కాంగ్రెస్ ను అడుగుపెట్టనీయద్దనే కృత నిశ్చయానికి ప్రజలు వచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ఏకాత్మత మానవతావాదం, అంత్యోదయ భావనతో ప్రేరణ పొందిన బిజెపి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలిసి అంత్యోదయ మార్గంలో నిరంతరం ముందు కొనసాగుతుందన్నారు. చిట్ట చివరి పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అంత్యోదయ విధానంతో ఏకత్మత మానవతావాదం ఆచరణగా , జాతీయ వాదమే సిద్ధాంతంగా కొనసాగుతున్న ఏకైక పార్టీ బిజెపి యే అన్నారు. 44 ఏళ్ల కటోర శ్రమ, పోరాటం త్యాగాలతో పార్టీ స్థాయికి ఎదిగిందని, ఈ స్థాయికి పార్టీని తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు విశేష కృషి చేశారని, వారు పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉందని, అందుకే వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు, ఆరు రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షాలతో కలిపి (ఎన్ డి ఏ) ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రోగ్రాంలో భాగంగాదేవాలయ సందర్శన, దేవాలయ స్వచ్ఛత, రచ్చబండ కార్యక్రమం, నర్సింగాపూర్ వీధుల గుండా బైక్ ర్యాలీ, అంగన్వాడీ సందర్శన, ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయినా కర సేవకుల సన్మానం, బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, పట్టణ ఉపాధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జ్ యాళ్ల సంజీవరెడ్డి మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి ఇప్పల నర్సింగాపూర్ 61,62,63 బూత్ అధ్యక్షులు పల్లె వీరయ్య, యాళ్ల లీల, బొడ్డు మహేష్, కార్యక్రమం కో ఆర్డినేటర్లు గంగిశెట్టి ప్రభాకర్, పోతుల సంజీవ్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పడారి కొమురయ్య, సబ్బని రమేష్, యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, కళ్లెపు రేణుక, గుర్రం సంతోష్, కోలిపాక వెంకటేష్, గూడూరి రాం రెడ్డి, గూడూరి మల్ల రెడ్డి, యాళ్ల కొండల్ రెడ్డి, పడారి కొమురయ్య, వేముల హృతిక్ , బోరుగాల అజయ్, యాళ్ల రాజిరెడ్డి, గాజ తిరుపతి, పిల్లి రాజు ,మార్క మొగిలి ,బొల్లావేణి మల్లయ్య ,కంప రాజు ,పిల్లి చంద్రమోగిలి, డోరి ఐలయ్య, పడారి అనిల్ ,గోస్కుల శ్రీనివాస్ ,గోస్కుల అజయ్ ,గోవిందుల అజయ్, గోవిందుల రంజిత్ ,యాళ్ల రాజు ,పరకాల రాజు గుంపుల కిరణ్ ,పరకాల అఖిల్ ,తొర్రి మమతా, అరే శిరీష ,పామిండ్ల మాళవిక , గాజ సరిత , క్యాసవెంకటేష్ తాళ్లపల్లి దేవేంద్ర ఆవుల సదయ్య సబ్బని మాధవి మాటూరి స్వర్ణలత, గంధం అనిల్, తాళ్లపల్లి హరీష్, కుసుమ సమ్మయ్య, అనిశెట్టి సాంబశివ, మెరుగు జ్యోతిరెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











