Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఈనెల 19వ తేదీ శనివారం హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప గార్డెన్లో పర్యావరణ పరిరక్షణ తడి చెత్త పొడి చెత్త సేకరణ పై స్వచ్ఛ హుజురాబాద్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ కె oసారపు సమ్మయ్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ…జిల్లాలోనే తొలిసారిగా పర్యావరణం పై ఎగ్జిబిషన్లో విద్యార్థులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు జమ్మికుంట కె.వి.కె శాస్త్రవేత్తలు ఇందులో తమ ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, cdma శ్రీదేవి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబుతో పాటు పలువురు అతిథులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఎగ్జిబిషన్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.






