Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడి వేధింపులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ, మోడీ, బీజేపీ కుట్రపూరిత వైఖరి నశించాలి అంటూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు సాయిపవన్ మండిపడ్డారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో కలిసి మాట్లాడారు. గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు ధోరణి నశించాలనీ, గుజరాత్ లో జరిగిన ఎఐసిసి ప్లీనరీ సమావేశం తరువాత బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతుంటే కాంగ్రెస్ అగ్రనేతలను ఈడి కేసుల పేరుతో వేధింపులు చేస్తూ ఇబ్బందులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ పెరుగుదల చూసి ఓర్వలేక అది నాయకత్వాన్ని ఈడి కేసుల పేరుతో చార్జిషీట్ ల పేరుతో ఇబ్బందులు పేడుతుందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వతంత్ర్యం కోసం పని చేసిందనీ, దేశంలో గాంధీ కుటుంబమే, ఆస్తులను సంపాదించాలని అనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను, చేసింది వాళ్ళు అవినీతికి పాల్పడకపోయేదా.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బధనం చేస్తున్నారు అని అన్నారు. 85 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీనీ కూడా విచారణ పేరుతో ఇబ్బంది పేడుతు రాక్షస్వతంతో వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. తనేషాహి నై చెలెగి నరేంద్ర మోదీ తనేషాహి అని దేశం మొత్తం గాంధీ కుటుంబానికి సానుభూతి తెలుపుతుందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించి రాజ్యాంగాన్ని రక్షించాలని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పార్లమెంట్ లో మాట్లాడుతుంటే అహ్మదాబాద్ సభతో బిజెపి ఎక్కడ దెబ్బతింటుందో కాంగ్రెస్ ఎక్కడ పెరుగుతుందో అని అధైర్యపరాచడానికి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలో వేదికగా బిజెపిని డిమాండ్ చేస్తున్నా గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టండి కానీ కాంగ్రెస్ బలపడుతుందన్నప్పుడు ఇలా ఈడి కేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దేశంలో అనేక మంది నిరవ్ మోదీ లు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవు అని, దేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు Lic, ఎయిర్పోర్ట్, పోర్టులు, రైల్వేలు అన్ని ఆర్థిక సంస్థలు అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నెహ్రూ కుటుంబం ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ వారసులను సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఇబ్బందులు పెడుతున్నారని సాహూ సాయి పవన్ ఆరోపించారు.
దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి కోరుకునే అందరూ ఈ వేధింపులు ఖండిస్తున్నారన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు అధైర్య పడవద్దని వారిని మీ వెంట మేమున్నామని దేశమంతా ముక్తకంఠంతో మద్దతిస్తుందన్నారు. ఈడి లాంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధింపులకు కక్ష సాధింపులకే వాడుతుందనీ,
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు హుస్నాబాద్ కాంగ్రెస్ అండగా ఉందన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ, నరేంద్ర మోదీ కక్ష సాధింపులను ఖండిస్తున్నాం అని సాహు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గొడిశాల వినయ్ గౌడ్, ఎల్కతుర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యువరాజ్, ఎన్ఎస్ యుఐ ఐడల నాయకులు ప్రదీప్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నితిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






