
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:అంతర్ జిల్లా దొంగ అల్లెపు కృష్ణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు హుజూరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ వెల్లడించారు. అటెన్షన్ డైవర్షన్ కేసుల గురించి ఆయన వివరిస్తూ… ఈ మధ్యన 15వ తేది రోజున ఉదయం అందాద 09:00 గంటలకు అల్లెపురెడ్డి కమలమ్మ W/o కొమురెడ్డి కలిసి తనకు ఆరోగ్యం బాగోలేనందున జమ్మికుంటలోని వరుణ్ సాయి ఆసుపత్రికి వెళ్లారన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ లేనందున తను, తన భర్త ఇద్దరు కలిసి ఇంట్లో సామాన్లు తీసుకుందాం అని కొండూరి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెట్ల మీద కూర్చున్నారనీ, వీరు కూర్చున్న వద్దకు అల్లెపు కృష్ణ వయసు 47 సంవత్సరాలు అను అతను అమ్మ నేను కనపర్తి కార్యదర్శిని మీ ఇద్దరికి రూ.4000 పెన్షన్ పెట్టిస్తా, మీ ఇద్దరివి ఆధార్ కార్డు జిరాక్స్ లు కావాలి అని అన్నాడన్నారు. ఉదయం పూట మీ ఇంటకి వెళ్తే మీరు ఎవరు లేరునీ, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కనబడ్డారు అని అన్నాడన్నారు. అతని మాటలు నమ్మి అతని భార్యని అక్కడి కూర్చోపెట్టి ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడానికి వెళ్ళినాడన్నారు. తన భర్త వెళ్లినాక అల్లెపు కృష్ణ ICICI బ్యాంకు ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొబెట్టి, అమ్మ నీ ఫోటో తీయాలని, నీ ఒంటి మీద బంగారం ఉండకూడదు అని మాయమాటలు చెప్పి తనని మోసగించి తన మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు గొలుసు తీసుకుని, రేషన్ కార్డు పత్రాల కోసం 40 రూపాయలు ఇచ్చి మళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడన్నారు. బంగారం విలువ అందాద రూ. 80,000 ఉంటుందనీ, బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరి మహిళలు, వృద్ధులు ఇలా పెన్షన్ ఇస్తా అంటే నమ్మకూడదని, అలాగే తెలియని వారితో తమ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని ఏసీపీ తెలిపారు. అలాగే అనుమానితుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వృద్ధాప్య తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ శ్రీనివాస్ జి సూచించారు. నిందితుడైన అల్లెపు కృష్ణను జమ్మికుంట పోలీసులైనా సీఐ వీ రవి, హెడ్ కానిస్టేబుళ్లు నెల్లి మోహన్, జీ సదయ్య, కానిస్టేబుళ్లు అబ్దుల్ ఖదీర్, V శ్రీకాంత్ లు 48 గంటలలో నిందితున్ను పట్టుకోవడం జరిగిందన్నారు. ఇతని దగ్గర నుండి జమ్మికుంటలోని రెండు తులాల బంగారం మరియు హైదరాబాద్ పీఎస్లో తులం నర బంగారం రికవరీ చేయడం జరిగిందన్నారు. ఇతనిపై జమ్మికుంటలో 3 కేసులు, హుజురాబాద్ లో 3కేసులు, కరీంనగర్లో 10 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 85 కేసులు, ఇతను గతంలో రెండుసార్లు PD యాక్ట్ కింద నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు అని ఏసిపి శ్రీనివాస్ జీ తెలిపారు. మళ్లీ నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అయితే అల్లెపు కృష్ణ ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామం యొక్క మహిళలతో ఆ గ్రామం యొక్క పంచాయతీ కార్యదర్శి అని చెప్పి వారికి పెన్షన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారి దగ్గర నుండి మంగళసూత్రం మరియు నల్లపూసలు లాంటి బంగారు వస్తువులు ఫోటో కి అడ్డు వస్తాయని చెప్పి మళ్లీ ఇస్తానని తన దగ్గర ఉంచుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడన్నారు. కాబట్టి ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు మీ వద్దకు వచ్చి మీకు పింఛన్ ఇప్పిస్తాను లేదంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తాను అంటే నమ్మి మీ దగ్గర వస్తువులు ఎవరికి ఇవ్వకూడదన్నారు.

అంతర్ జిల్లా దొంగ ఆల్లెపూ కృష్ణను అరెస్టు చూపిస్తున్న ఏసీపీ శ్రీనివాస్ జీ

దొంగ నుడి రికవరీ చేసిన బంగారం..





