
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వాసి మృతి చెందగా వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధుమిత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు నగరంలోనీ మణికొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన కుతాడి జీవన్ (23) అనే యువకుడు మృతి చెందాడు. జీవన్ హైదరాబాదులో స్విగ్గి డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం మణికొండ వద్ద కారు ఢీకొన్న అనంతరం లారీ కింద పడడంతో అతడు మృతి చెందాడని తెలిపారు. మృతుని తండ్రి కుతాడి తిరుపతి గతంలో బోర్నపల్లి గ్రామపంచాయతీ ఉన్నప్పుడు ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. ఆ గ్రామం హుజురాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో అప్పటినుండి తిరుపతి ఖాళీగనే ఉంటున్నాడు. తిరుపతికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా జీవన్ పెద్ద కుమారుడు. చేతికి అంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.



హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీవన్..

కుతాడీ జీవన్ (ఫైల్ ఫోటో)





