
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలములోని రంగాపూర్ లో గల కల్వరి టెంపుల్ లో ప్రతి సంవత్సము మాదిరిగానే ఈ సంవత్సరం కుడా గొప్పగా ఈస్టర్ వేడుకలు జరిగాయి. ఫాదర్ నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు దైవ సందేశం అందించుటకు ప్రత్యేక అతిధులుగా పాస్టర్ కొమ్మగళ్లు డేనియల్ హాజరై ప్రతేక పాటలతో సంఘ సభ్యులను బలపరిచి దైవ సందేశం అందించారు. యేసు క్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి ఆదివారం సమాధి నుండి లేవడమే ఈస్టర్ అంటారని దీనిని క్రైస్తవులు ప్రపంచమంతా గొప్ప పర్వ దినంగా, పండుగ దీనంగా జరుపుకుంటారని ఈ రోజు క్రైస్తవులు కలిగిన దానిలో నుండి ఇతరులకు అన్నదానం గాని వస్త్ర దానం గాని చేస్తారని తెలిపారు. క్రీస్తు జీవిత త్యాగాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు ప్రేమ, శాంతి, దయ, కరుణ గుణాలను అలవర్చుకొని జీవించాలని బోధించారు. అనంతరం సంఘ సభ్యులు బొడ్డు మంజుల, బొడ్డు కల్పన ప్రత్యేంకంగా తయారు చేయించిన కేక్ ను అతిధి స్పీకర్ డేనియల్ ఫాదర్ నెల్సన్ – సుదిన దంపతులు మరియు సంఘ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. కేక్స్ తో పాటు నాగార్జున – కవిత దంపతులు మరియు బొడ్డు కోమల కుటుంబాలు సమోసాలు అందరికి పంచి పెట్టారు. కరీంనగర్ నుండి కేసి ప్రేమ్ కుమార్ – షీలా దంపతులు సంఘ సభ్యులకు పదిమందికి చీరలు పంపించగా వాటిని ఫాదర్ నెల్సన్ చేతుల మీదుగా పేదవారికి పంపిణీ చేశారు.








