
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ కూడలి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టీ ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాబు నిండా నూరేళ్లు జీవించి రెండు తెలుగు రాష్ట్రాలకు మరిన్నీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమoలో టిడిపి నాయకులు ఎస్కే ఫయాజ్, వర్దినేని లింగారావు, రామగిరి అంకుస్, శివ కోటేశ్వరరావు, ఆడెపు రవీందర్, ప్రతాప్ రాజు, ఇనుగాల గోవర్ధన్, కామిని రాజేశం, బత్తిని సంజీవ్, కాట్రపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

