
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం మాదిరిగానే తాత్సారం చేయడము సరైనటువంటి విధానం కాదని అన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి ఐదు డిఏ లను వెంటనే విడుదల చేస్తూ నూతన పిఆర్సిని జూలై 2023 నుండి అమలు చేయడమే కాకుండా మార్చి 2024 నుండి పదవి విరమణ పొందిన పెన్షనర్స్ కు పెన్షనర్స్ బెనిఫిట్స్ వెంటనే మంజూరు చేయాలనీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్స్ అంటేనే వృద్ధులని అనేక అనారోగ్య సమస్యలకు గురికావడానికి ఆస్కారం ఉన్నందున ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యాన్ని అందించడంతోపాటు అదే విధంగా కార్పొరేట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ లో గరిష్ట పరిమితి లేని నగదు రహిత నాణ్యమైనటువంటి వైద్యము పెన్షనర్స్ కి అందేటట్లు చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టాప్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు బొంగోనీ వెంకటయ్య, హుజురాబాద్ శాఖ ఉపాధ్యక్షులు చొల్లేటి మల్లారెడ్డి, దొంత హరికిషన్, కట్ట నాగభూషణాచారి, శనిగరం నరేందర్, చీకట్ల సమ్మయ్య, రావి కంటి రామకృష్ణయ్య, గౌరీశెట్టి సాంబయ్య, సయ్యద్ మునీరుద్దీన్, గరిగ చంద్రయ్య, తాటిపాముల కనుకయ్య, మండల వీరస్వామి, గాజర్ల బుచ్చిరాజం, గాజ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.







