
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కు హీరోయిన్ సమంత అంటే చచ్చేంత ఇష్టం. ఆమె నటన మాత్రమే కాదు ఆమె చేసే సేవా కార్యక్రమాలు అంటే కూడా అభిమానం. ఈ క్రమంలోనే ఆమె పుట్టిన రోజు నాడు వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన స్వంత ఇంటిలోనే ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది 2023లో ఆమె పుట్టిన రోజు సందర్భంగా తెనాలిలో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టిన రోజు నాడు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. అనాధ బాలబాలికలు, వృద్దులను తెనాలి నుంచి తీసుకొచ్చి వారికి అన్నం పెట్టి పంపించారు. సమంత చిన్న పిల్లలకు చేస్తున్న కార్రక్రమాలతో స్పూర్తి పొందిన సందీప్ ప్రతి ఏటా అదే విధంగా అనాధ బాలబాలికలు అన్నదానం చేస్తున్నారు. సందీప్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయడం లేదు. ఆటో నడుపుకుంటూ జీవించే సందీప్ కేవలం సమంత చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగానే గుడి కట్టించి అన్నదానం చేస్తున్నట్లు చెప్పాడు.
