
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బేడ బుడగ జంగం_ జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గావ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఈరోజు రాత్రి కొవ్వొత్తులతో నివాళ్లు కార్యక్రమం నిర్వహించారు. కాశ్మీర్ పహల్గావ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతో పాశవికంగా ప్రతి వారిని హిందువా ముస్లిమ్స్ అని మరి అడిగి 28 మందిని అతి దారుణంగా కాల్చి చంపడం సహించరాణిదన్నారు. కాశ్మీరు అందాలు చూడడానికి టూరిస్టులు వివిధ దేశాల నుండి రాష్ట్రాల నుండి ఆ ప్రాంతానికి వస్తారని తెలిసి ఆ ప్రాంతంలో భద్రత ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బతీసి ఇండియా పవర్ ఏంటో తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు అధికారం కొరకు ఇండియాలో నివసిస్తున్న వారి మధ్య మత సమస్యలు సృష్టిస్తూ కుల సమస్యలు సృష్టిస్తూ ఈరోజు పార్టీలు వ్యవహ రిస్తున్న తీరు, పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో పాల్గొన్న 28 మంది హిందువులను చంపితే ఇండియాలో ఉన్న మన ముస్లిమ్స్ సోదరులు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మన దేశం మీద ఏ దేశానికి చెందిన ఉగ్రవాదులు దాడి చేసిన ఇండియాలో ఉన్న మనమందరం ఇదే ఐక్యమత్యంతో పోరాడాల్సిందిగా మేము కోరుకుంటున్నామన్నారు. ఇండియాలో ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరం ప్రేమ ఆప్యాయతలతో బ్రతుకుతుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఓరువలేక మన ఐక్యతని దెబ్బతీయడానికి మనల్ని వేరు పరచడానికి, హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న కుట్రాలను తిట్టికొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నామన్నారు. పాకిస్తాన్ డాం డాం.. పాకిస్తాన్ డాం డాం, భారత్ మాతాకీ జై.. భారత్ మాతాకీ జై.. అంటూ నినాదాలు చేశారు.


