Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలు ఐదు శాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లించేందుకు నేడు 30వ తేదీ బుధవారం చివరి రోజని మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య మంగళవారం తెలిపారు. 2025-26 ఆర్థిక సం.నకు గాను ప్రభుత్వం వారు పురపాలక సంఘాలలో ఆస్తిపన్ను చెల్లింపులకు 5% పన్ను రాయితీని కల్పించారని చెప్పారు. అయితే ఈ పన్ను రాయితీ యొక్క కాలపరిమితి తేదీ: 30-04-2025 రోజున(బుధవారంతో) ముగుస్తున్నందున, పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశమును వినియోగించుకుని ఆస్తి పన్నులు చెల్లింపులు చేసి, పట్టణాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు.

మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య





