
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో బుధవారం ఉదయం బాలుడుపై ఓ వీధి కుక్క దాడి చేయగా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రామంచ అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీదికుక్క ఒక్క సారిగా బాలుడు పై దాడి చేసింది. దీంతో బాలుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రధమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. గ్రామ ఫరిధిలో ఇటీవల కూడా ఇద్దరు పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం జరిగిందని, అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కల భారి నుండి ప్రజలను కాపాడి వాటి నుండి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.


వీధి కుక్కల దాడిలో గాయపడిన రామంచ అయాన్ అనే రెండు సంవత్సరాల బాలుడు


ప్రథమ చికిత్స అనంతరం బాలుడిని వరంగల్ కు తరలిస్తున్న తల్లిదండ్రులు..





