Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఘనంగా శ్రీ మహాత్మా బసవేశ్వర 892వ జయంతోత్సవ కార్యక్రమాన్ని చెల్పూర్, పోతిరెడ్డిపేట గ్రామాలకు చెందిన వీర శైవ లింగాయత్ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె కనకయ్య శ్రీ మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేశారు. బసవేశ్వర స్వామి నాడు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నియాజ్ హుస్సేన్, ఆర్ఐ రంజిత్ రెడ్డి, సిబ్బంది భాస్కర్, వీరశైవ లింగాయత్ కుల బాంధవులు బుట్ట గణపతి, అద్దునూరి రవీందర్, అద్దునూరి శివయ్య, అద్దునూరి జగదీష్, అద్దునూరి దేవేందర్, కుదిరే నాగరాజు, కొండూరి ఈశ్వరయ్య, పెనాల మొండయ్య, గుడ్డం రాజయ్య, చింతల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.






