Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పిల్లల్లో క్రీడలు నాయకత్వ లక్షణాలు పెంచుతాయని హుజురాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉంటున్నారని అందువల్ల వారిలో స్నేహభావము నాయకత్వ లక్షణాలు మరొకరితో సమన్వయం చేసుకోవడం తగ్గుతుందని అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ పిల్లల్లో మార్పుల కోసం వేసవి క్రీడా శిబిరం లాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. దీనివల్ల పిల్లల్లో మంచి భావాలు పెరుగుతాయని మంచి భావాలు కలిగిన పిల్లలు పెద్దవారైతే మంచి పౌరులుగా మారుతారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి సెలవులలో వృధాగా గడపకుండా క్రీడా శిబిరంలో చేర్పించాలని ఆయన సూచించారు. హుజురాబాద్ ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరం లో తమ పిల్లలకు క్రీడలను నేర్చుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ… క్రీడలు పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. సామాజిక సహాయకర్త వర్ధినేని రవీందర్రావు మాట్లాడుతూ… ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్లాస్టిక్ వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయని అన్నారు. హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి క్రీడా ఉచిత శిక్షణా శిబిరానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. హాకీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ…. వేసవి శిక్షణా శిబిరంలో తమ పిల్లలకు వారికి నచ్చిన ఆసక్తి ఉన్న క్రీడల లో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. మునిసిపల్ కమిషనర్ కే . సమ్మయ్య మాట్లాడుతూ….హుజురాబాద్ మునిసిపాలిటీని ప్రజల సహకారంతో సుందర పట్టణంగా తయారు చేయడం జరుగుతుందని ఇంతే కాకుండా పిల్లలను సైతం సెలవుల్లో వారిలో దాగివున్న క్రీడా స్ఫూర్తిని బయటికి తీసుకొని రావడానికి ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ రిటైర్డ్ ఎంఈఓ రామ్ కిషన్ రాజు, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ నవీన్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సొల్లు సారయ్య, సలహాదారు కొన్ని రాజిరెడ్డి, సామాజిక కార్యకర్త వర్ధిని రవీందర్రావు, వర్కర్అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










