
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యుత్ ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరం అని హుజురాబాద్ డివిజనల్ ఇంజినీర్ (ఆపరేషన్స్) ఎస్. లక్ష్మారెడ్డి మరియు డివిజనల్ ఇంజినీర్ (టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్) ఉపేందర్ తెలిపారు. శనివారం హుజురాబాద్‌లోని మధువని గార్డెన్లో నిర్వహించిన విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బందికి మరియు వినియోగదారులకు విద్యుత్ సంబంధిత ప్రమాదాల దూరంగా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా విద్యుత్ తో పని చేసే సందర్భాల్లో ఆచరించవలసిన భద్రతా మార్గదర్శకాలను పాటించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించే పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందితో పాటు ప్రజల్లో కూడా భద్రతపై చైతన్యం పెంచే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఇ) శ్రీనివాస్, హుజురాబాద్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈలు), సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







