
– ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచానికే కంటిలో నలుసు లా తయారైన పాకిస్థాన్ అస్తిత్వాన్ని ప్రపంచ చిత్ర పటంలో లేకుండా చేయాలి.
– ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:
ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధంగా చూడకుండా ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ధర్మ పోరాటంగా చూడాలని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
భారత్ ఎంతో శాంతి యుతంగా ఉండాలని చూసినా దాయాది పాకిస్థాన్ పక్కలో బళ్ళెంలా ఐఎస్ఐ ఇస్లామిక్ ప్రేరేపిత టెర్రరిజం తో ఉగ్రామూకలతో భారత పౌరులే లక్ష్యంగా దొంగ చాటుగా దాడి చేసి అమాయక పౌరుల ప్రాణాలను బలి కొనడం క్షమించరాని ఘోరమైన దుశ్చర్యమూగ భావించి యావత్ భారత సమాజం మద్దతుతో ముష్కరులను మట్టు బెట్టడానికి భారత సైన్యం రంగలోకి దిగి చర్యలు చేపట్టిందని మీడియాతో పోలాడి రామారావు అన్నారు. భారతీయులనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసిన ఏప్రిల్ 22నాటి అతి ఘోరమైన పహల్గాం పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వ్యూహాత్మకంగా సైనిక చర్యలు చేపట్టడం సముచితమైన నిర్ణయమన్నారు.
ఉగ్రదాడిలో భర్తను భార్య ముందే చంపివేసి వారి నుదిటి సిందూరాన్ని చేరిపివేసిన ఉగ్రవాదుల ఆంతమే ఆ సింధూరం పేరుతో భారత్ ఆపరేషన్ సిందూరం చేపట్టి మిస్సైల్లతో తొలుత ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లలో గల 9 ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వీటిని ధ్వంసం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం హర్షనీయమన్నారు. ఇది సరిపోదని ఉగ్రవాదం పూర్తిగా ధ్వంసం అనేది ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయిన పాకిస్థాన్ అస్తిత్వo ఉనికినీ ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని రామారావు వివరించారు.
ఇది జరగాలంటే పాకిస్థాన్ భూభాగంలో 40 శాతం ఉన్న బెలూచిస్తాన్ ప్రజలు దశాబ్ద కాలంగా స్వతంత్ర దేశం కోసం ఉద్యమిస్తున్నారని అక్కడ నివసిస్తున్న వారిలో హిందువులే అధికంగా ఉండటంతో వారి ఆకాంక్షల మేరకు మన భారత ప్రభుత్వం కూడా సహకరించి బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించడంలో సహకరించి వారి కళలను సాకారం చేయాలని ఆకాంక్షించారు. మిగిలిన పాక్ భూభాగాన్ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో యుక్తంగా అక్కడి యువత అభీష్టం మేరకు మొత్తం మన భారత దేశంలో విలీనం చేసి అఖండ భారత్ ఏర్పాటుకు పునాదులు వేయాలని సూచించారు.
ఉగ్ర దాడి నేపథ్యంలో దాని అంతానికి ప్రపంచ దేశాలన్నీ తమ ఇంటెలిజెన్స్ లను రంగంలోకి దింపడమే కాకుండా మన భారత్ కు సంఘీభావం తెలుపుతున్న తరుణంలో ఈ సమయాన్ని భారత అవకాశంగా మలచుకొని అఖండ భారత్ ఏర్పాటుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. కొన్ని పాక్ అనుకూల శక్తుల ఒత్తిడికి భారత్ తలొగ్గవద్దని, కార్గిల్ యుద్ధ పోరులో పాకిస్థాన్ చేతులెత్తేసి, బెంబేలెత్తి అప్పటి అమెరికా అధ్యక్షుడు తో అప్పటి భారత ప్రధాని వాజపేయి కి ఫోన్ చేయించి భారత్ పై న్యూక్లియర్ బాంబులు వేస్తామని చెప్పించగా దానికి సమాధానంగా వాజపేయి జవాబిస్తూ యేస్ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అందుకు బదులుగా పాకిస్థాన్ ను ప్రపంచ పాఠం లో లేకుండా చేస్తామని బదులిచ్చి వాజపేయి దైర్య సాహసాలు ప్రదర్శించారని రామారావు గుర్తు చేశారు.
పాకిస్థాన్ ప్రజలలో కానీ అక్కడి రాజకీయ పార్టీల లో కాని పాకిస్థాన్ మిలటరీ నాయకులు ఉగ్రవాదులను ప్రోత్సహించడాన్ని
వారికి మద్దతుగా నిలవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండడం, భారత్ సైనిక దాడికి, దిక్కుతోచక పాకిస్థాన్ బెంబేలెత్తి కకా వికలమవుతూ అక్కడి ప్రధాని సహా ముఖ్య నాయకులు అదృష్యమవడం, మన దెబ్బకు ఆహా అంటున్నారని, దిక్కు తోచనిపరిస్థితిలో తమ ఉనికిని చాటి చెప్పటానికి భారత్ మిలటరీతో పోరాటం చేయకుండా సరిహద్దున ఉన్న గ్రామాల అమాయక పౌరులపై పాక్ కాల్పులు జరపడం హేయమైన పిరికి పందల చర్యగా అభివర్ణించారు. భారత వీర సైనికులకు యావత్ భారతావని సెల్యూట్ చేస్తున్నట్లు పోలాడి రామారావు కొనియాడారు.







