
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని హుజురాబాద్ టౌన్ సీఐ టీ కరుణాకర్ పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన హుజురాబాద్ టౌను సీఐ టీ కరుణాకర్ శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా పాత్రికేయులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు ఎవరైనా ఏలాంటి పైరవీలకు తావు లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎవరైనా దళారులు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసినట్లు తన దృష్టికి వస్తే అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్తులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. అన్నీ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పోలీసులకు సహకరించి సుపరిపాలన కొనసాగేలా సహకరించాలన్నారు. ఆయన వెంట ఎస్సై యునస్ ఆలీఖాన్ ఉన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న టౌన్ సిఐ టి కరుణాకర్
హుజూరాబాద్ సీఐ కరుణాకర్ కి పోచమ్మ గుడి కమిటీ సభ్యులు చిరు సన్మానం
హుజూరాబాద్ పోలీస్ సర్కిల్‌కు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సీఐ కరుణాకర్ ని హుజూరాబాద్ పోచమ్మ గుడి కమిటీ సభ్యులు కలసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ..హుజూరాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావాలని ప్రజల అభిలాష అని, సీఐ కరుణాకర్ తనదైన శైలిలో పోలీస్ సేవలందించి ప్రజల విశ్వాసాన్ని గెలవాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఐ కరుణాకర్ మాట్లాడుతూ…ప్రజల సహకారం వల్లే శాంతి భద్రతలు నిలబడతాయనీ, ప్రతి ఒక్కరితో సమన్వయం కలిగి, న్యాయపరమైన విధంగా పనిచేస్తాను అని హామీ ఇచ్చారు.

హుజూరాబాద్ సీఐ కరుణాకర్ కి చిరు సన్మానం చేస్తున్న పోచమ్మ గుడి కమిటీ సభ్యులు
హుజూరాబాద్ కి నూతనంగా వచ్చిన సీఐ కరుణాకర్ కి హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల చిరు సన్మానం
హుజూరాబాద్ పోలీస్ సర్కిల్‌కు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సీఐ కరుణాకర్ ని,హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ…హుజూరాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతుగా సహకరిస్తామన్నారు. సీఐ కరుణాకర్ తనదైన శైలిలో పోలీస్ సేవలందించి ప్రజల విశ్వాసాన్ని గెలవాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఐ కరుణాకర్ మాట్లాడుతూ.. ప్రజల సహకారం వల్లే శాంతి భద్రతలు నిలబడతాయనీ, ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ.. న్యాయపరంగా ముందుకెళుతూ అందరికీ సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి సదానందం మరియు సీనియర్ నాయకుడు ఉమాపతిరావు తదితరులు పాల్గొన్నారు.

నూతన సిఐని సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు..