
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 58వ జన్మదిన వేడుకలు గురువారం హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హుజురాబాద్ లోరక్తదానం మొక్కలు నాటే కార్యక్రమం రోగులకు పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పేరుపొందిన పొన్నం ప్రభాకర్ గౌడ్ , మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ముందున్నారని కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని మరిన్ని గొప్ప పదవులు రావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, సీనియర్ నాయకులు సొల్లు బాబు, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, మహిళా పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, మహిళా మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, గోస్కుల నాగమణి, తరుణ్, సంపంగి అరుణ్ కుమార్ మిడిదొడ్డి రాజు, కరీమా తదితరులు పాల్గొన్నారు.
హుజురాబాద్ మున్సిపాలిటీ 12, 13వ వార్డు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ వరంగల్ రహదారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లడుతు తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ ఉద్యమ పోరాటం అద్వితీయమని, తెలంగాణ స్వరాష్ట్రం సాధించేవరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమంలో తనతో పాటు యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచి వెన్నుదట్టి ప్రోత్సహించిన ఘనత పొన్నం ప్రభాకర్ దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా బడుగు బలహీన వర్గాలకు తనదైన శైలిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న చరిత్ర పొన్నం ప్రభాకర్ సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు, బీట్ల వెంకటేష్, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, జంగ అనిల్ కుమార్, కొలుగూరి సమ్మయ్య, వెలిశాల నారాయణ, కొత్తగట్టు చక్రపాణి,మోరే,సాదిక్, ముక్క రవితేజ, గాదె శ్రీకాంత్, ఉపేందర్, మోరే సంపత్, కట్కోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ నాయకత్వంలో నియోజకవర్గ మొత్తం ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో భాగంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణం సివిల్ హాస్పిటల్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ 58వ జన్మదిన సందర్భంగా 58 మందితో పాటు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ రక్తదానం చేయడం జరిగింది. అనంతరం యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి ఉద్యమాల నుండి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలందించిన ఘన చరిత్ర కలిగిన వారు తెలంగాణ ఉద్యమంలో అనేకమంది ప్రాణాలర్పిస్తుంటే చూడలేక పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడి బిల్లు ప్రవేశపెట్టించిన ఘనత ప్రభాకర్ అన్నకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆటుపోట్లు తిన్న ఏ ఒక్క రోజు పార్టీని విడిచిపెట్టకుండా పార్టీకి వెన్ను తట్టి నిలుస్తూ కార్యకర్తలకు అండగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంలో పొన్నం ప్రభాకర్ ది కీలక పాత్ర పోషించారన్నారు. బీసీ కులగణలో దేశానికి ఆదర్శంగా కులగన్న చేయడంలో ప్రభాకర్ శ్రమ ఎంతో ఉంది మాలాంటి యువజన కాంగ్రెస్ వారికి ఒక ఆదర్శప్రాయకుడిగా ఉన్నాడని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొలువురి కిరణ్, సీనియర్ నాయకులు సొల్లు బాబు, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశీల, మహిళా పట్టణ అధ్యక్షురాలు పుష్పలత, మహిళా మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గోస్కుల నాగమణి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ తరుణ్, మండలం వైస్ ప్రెసిడెంట్ సంపంగి అరుణ్ కుమార్, సోషల్ మీడియా ఇంచార్జ్ మిడిదొడ్డు రాజు, మహిళా కమిటీ కరీమా తదితరులు పాల్గొన్నారు.


రక్తదానం చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకుడు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు..



12, 13 వ వార్డుల పరిధిలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు