
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం లో జరిగే ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో క్రీడాకారుల మధ్య హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య తన కుమారుడు కేంసారపు సాయి త్రినిష్ జన్మదిన వేడుకలు గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు క్రీడాకారుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పిల్లలకు కోడిగుడ్లు, అరటిపండ్లు అందజేశారు. ఈసందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ….పుట్టినరోజు వేడుకలు పిల్లల మధ్య క్రీడాకారుల మధ్య జరుపుకోవడం సంతోషదాయమని, హోటల్ ల, డాబాలలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం కన్నా పిల్లల మధ్య చేసుకోవడం మంచిదని అన్నారు. . ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ముక్క రమేష్, వాకర్స్ వేల్పుల రత్నం, సాదుల రవీందర్, ఈశ్వర్ రెడ్డి, ప్రభాకర్, మేనేజర్ భూపాల్ రెడ్డి, జవాన్లు ప్రతాప రాజు, రమేష్, అనిల్, వినయ్, శ్రీనివాస్, రమేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
