
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట (వీణవంక): వీణవంక మండలం కొండపాక గ్రామంలో పిడిఎఫ్ బియ్యం 1 తారీఖు నుండి 15వ తారీకు వరకు ప్రతి నెల రెగ్యులర్గా గ్రామ ప్రజలకు అందిస్తున్న అని డీలర్ వసంత ఓ ప్రకటనలో తెలిపారు. ఇ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..పక్కన ఉన్న గ్రామాలన్నీ, బియ్యం పంపిణీ చేసిన చేయకపోయినా కొండపాక గ్రామంలో ప్రతిసారి అందుబాటులో ఉంటూ బియ్యం అందజేసే కార్యక్రమంలో, కొండపాక గ్రామం ముందుంటుందన్నారు. 8వ తేదీనాడు పిడిఎఫ్ బియ్యం కొండపాకలో దిగుమతి అయిందని తెలియజేశారు, ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బియ్యం పంపిణీ చేశానని అన్నారు. అలాగే రేపటి రోజున మా బంధువుల పెళ్లి ఉన్నందున ఉండలేకపోతున్నా అని గ్రామస్తులకు తెలియజేసినది కూడా చెప్పారు, నిన్నటి రోజున మా సొంత కుటుంబంలో మా బంధువుల మ్యారేజ్ ఒకటి ఉంటే, ఆ మ్యారేజ్ కి వెళ్లి రావడం జరిగిందన్నారు. మళ్లీ 11-5- 25న పొద్దున నుండి సాయంత్రం వరకు పిడిఎఫ్ బియ్యం అందించడం జరిగింది, అని మాట్లాడారు. ఒంటరి మహిళను అని చూడకుండా, కొంతమంది కావలసుకొని, నామీద అసత్యపు ప్రచారాలు చేస్తూ, ఆందోళన లోపు గురి చేస్తున్నారన్నారు. పిడిఎఫ్ బియ్యం మాకున్న సర్క్యులర్ ప్రకారం పోయవలసిన తేదీల్లో పంపిణీ చేయడం మా బాధ్యతగా, ప్రతి నెల అందిస్తున్నాం అని వివరించారు. మొత్తం పంపిణీ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మీడియా ద్వారా అని మాట్లాడారు. గతంలో గాని, ఇప్పుడు గాని, ఎవరు ఎలాంటి ఇబ్బంది పడలేదని, కొంతమంది మాత్రమే నామీద కక్షపూరితమైన, విషపు అసత్యపు ఆరోపణలు చేయడం జరుగుతుందని ఇది సరికాదని హెచ్చరించారు. నా మీద అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకునే విధంగా, వారిపై పరువు నష్ట ధావా కైనా వెళ్తానని ఆ ప్రకటనలో డీలర్ వసంత తెలిపారు.

డీలర్ వసంత







