
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ :ఇందిరమ్మ ఇళ్ల విషయంలో హుజురాబాద్ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, ప్రస్తుతం ఇచ్చిన ఇళ్ళతో పాటు రెండవ విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో ఎక్కువ కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంగళ వారం మంత్రి కార్యాలయంలో ఆయన్ని కలిసిన అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు సంభందించి విషయాలపై చర్చించారు.ఇళ్ల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించామని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఇంటి నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇల్లు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ పేరుతో నియోజకవర్గంలో ఒక్క ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారని, ప్రజలకు మంచి చేయాలని ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే రాజాకీయ ఉనికి కోసం ఆటంకాలు సృష్టించాలని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విడతల వారీగా ఇళ్ల ఎంపిక జరుగుతుందని, దళితులకు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ముందు ఉంటామని, ఇళ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దళారి వ్యవస్థ లేకుండా చూస్తున్నామని, ఎవరైనా డబ్బులు ఇవ్వమని అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
