Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇండియాపై అడుగడుగునా ఉగ్రవాదులను ఉసి గొలిపి విషం కక్కుతున్న పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పక పోతే వికసిత్ భారత్ లక్ష్యం గా దూసుకెళ్ళే ఇండియాకు వికాసం ఉండదని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరించారు.
మూడు సార్లు పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశం భారత్ కు వచ్చినా అగ్రరాజ్యం శాంతి సయోధ్య హిత వచనాలతో అప్పటి మన కేంద్ర ప్రభుత్వ పాలకులు ఘోరమైన తప్పిదం చేశారని, మేధావులు మాజీ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఉగ్రమూకల అంతమే లక్ష్యంగా పాకిస్థాన్ తో చేస్తున్న ధర్మ పోరాటంపై కూడా పాకిస్థాన్ ను మట్టు పెట్టే అవకాశాలు వచ్చినా మళ్లీ అగ్రరాజ్య అమెరికా హిత వచనాలతో భారత్ చేజార్చుకోవడం పట్ల మెజారిటీ దేశ ప్రజలు హర్శించలేక పోతున్నారని శుక్రవారం నగరంలో మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు అన్నారు. పాకిస్థాన్ దుష్ట కుయుక్తులతో మళ్లీ మనం మోసపోకుండా ఉండాలంటే పాక్ ఆక్రమించుకున్న ఆక్రమిత కాశ్మీర్ ను తక్షణం తిరిగి స్వాధీనం చేసుకుని పాకిస్థాన్ కు మనదేశం తగిన గుణపాఠం చెబుతేనే సీమాంతర ఉగ్రవాదానికి తెర పడుతుందని, ఉదాసీనత వహిస్తే దేశానికి పాకిస్థాన్ పెను ముప్పుగా పక్కలో బళ్ళెంలా ఉండి దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, దేశ వ్యాప్తంగా పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 1965లో ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా దైర్యంగా మన సైన్యం ముందుకు వెళ్ళి లాహోర్ కు చేరుకొని మట్టుపెట్టే అవకాశం వచ్చినా అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కి తగ్గామని, 1971లో పాకిస్థాన్ తో రెండోసారి 19 రోజులు మన సైనికులు యుద్ధం చేసి 99 వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని గ్వాలియర్ వద్ద మన సైనికులు బంధించి తీసుకు రాగా 3 నెలల తర్వాత అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తిరిగి పంపించి పాకిస్తాన్ ను మట్టు పెట్టే అవకాశం చెజార్చు కోవాల్సి రావడం మన భారత్ దురదృష్టకరమని అప్పుడు మట్టు బెడితే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కావని మాజీ సైనికులు, మేధావి వర్గంవారు, పౌరులు వాపోతున్నారని అన్నారు. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచిపోషించి ఇండియాలోకి అక్రమంగా జొప్పించిన ముష్కర మూకల చేతుల్లో దేశ పౌరుల ప్రాణాలను బలి తీసుకున్న తీరు బాధాకరమని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అభివృద్ధిలో దూసుకు పోవడం, బలంగా ఎదగడం ఇష్టం లేని కొన్ని దేశాలు పాకిస్థాన్ ను పావుగా వాడుకొని పాకిస్థాన్ఉగ్రవాదంపై నామ మాత్రంగా స్పందిస్తున్నారని ఇక ఎంత మాత్రం ఉపేక్షించ వద్దని రామారావు హెచ్చరించారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో 22శాతం ఉన్న హిందువులు ఉండగా నేడు 2 శాతం లోపే ఉన్నారని, బంగ్లాదేశ్ లో 20 శాతం నుంచి 6 శాతం లోపే హిందువులు ఉన్నారని దీనికి కారణం హిందువులను వారు మతోన్మాదంతో అనేక ఇబ్బందులకు గురి చేసి వారిని అక్కడ లేకుండా చేశారని అదే మన భారత్ లో ముస్లింల నేడు 22శాతంగా ఉన్న ముస్లింల జనాభా పెరుగుతో హిందువులతో సమానంగా సామాన హక్కుల తో స్వేచ్ఛగా సమ న్యాయంతో సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ఇది మత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
1971లో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో మన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఇండియా పాకిస్థాన్ వ్యవహారాల్లో తల దూర్చితే అమెరికా నోరు మూసుకొని కూర్చోబోదని ఇండియా కు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిక చేయగా అందుకు దీటుగా స్పందించిన ఇందిరాగాంధీ ఇండియా అమెరికాను స్నేహితునిగా మాత్రమే పరిగణిస్తోందని యజమానిగా కాదని తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉందని పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు ఇందిరా ఘాటుగా జవాబు చెప్పి భారత అమెరికా సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి వైట్ హౌస్ నుంచి దర్జాగా ఠీవిగా బయటకు వచ్చి అభివృద్ది చెందుతున్న దేశంగా ఆకృత్యాలపై పోరాడి దృఢంగా నిటారుగా ఉండే మా శక్తి ఏందో భవిష్యత్ లో ఋజువు చేస్తామని అమెరికా అధికారులతో అనడం అప్పట్లో సంచలనం అయ్యిందని
విశ్లేషకులు అంటున్నారన్నారు. ఇండియాకు చేరుకున్న తర్వాత నాటి ప్రతిపక్ష నేత వాజపేయితో ఇందిరాగాంధీ మాట్లాడి ఐక్యరాజ్యసమితి సమావేశానికి వాజపేయిని పంపి మన దేశ గళాన్ని వాజపేయి ద్వారా గలంగా వినిపించడంతో కన్నెర్ర చేసిన అమెరికా పాకిస్తాన్ ను చేరదీసి ఆర్థిక సైనిక సహాయం చేసే భారత దేశానికి అమెరికా కంపెనీల వచ్చే చమురు సరఫరాను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేసినా ఇండియా వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ నుంచి చమురు సరఫరాలను జరిపించుకుంది, ఆ తర్వాత ఇండియా సొంత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ గా రూపు దిద్దుకొని ఒక బలమైన దేశంగా ఇండియా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. అమెరికా నమ్మకమైన మిత్ర దేశం కాదని, తమ ప్రయోజనాలకు పాకిస్థాన్ కు అండగా ఉంటున్న సంఘటనలు చూస్తున్నామన్నారు. ఇండియా దెబ్బకు పాకిస్థాన్ బంగ్లాదేశ్ ను కోల్పోయిందని, కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ చేతిలో పాకిస్థాన్ తీవ్ర భంగ పాటుకు గురయ్యిందన్నారు. కార్గిల్ యుద్ధ పోరులో పాక్ చేతులెత్తేసి, బెంబేలెత్తి అప్పటి అమెరికా అధ్యక్షుడితో అప్పటి భారత ప్రధాని వాజపేయికి ఫోన్ చేయించి భారత్ పై న్యూక్లియర్ బాంబులు వేస్తామని చెప్పించగా దానికి సమాధానంగా వాజపేయి జవాబిస్తూ యేస్ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అందుకు బదులుగా పాకిస్థాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చి వాజపేయి దయిర్య సాహసాలు ప్రదర్శించారని రామారావు గుర్తు చేశారు. అప్పటి నుంచి మన దేశంపై పొరుగు దేశాలు విద్వేష భావంతో మనకు పక్కలో బల్లెంగా తయారై నేటికీ మనపై అనేక విధాలుగా విషం చిమ్ముతున్నాయన్నారు. ఆపరేషన్ సిందూరు పోరులో పాక్ కు వారు గతంలో సరఫరా చేసిన క్షిపణులను భారత్ కూల్చివేసి,9 ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసి కరడు గట్టిన ఉగ్ర మూకలను మట్టు పెట్టిందన్నారు, పాక్ కు చెందిన 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి, కరాచీ పోర్టును నాశనం చేసి ప్రపంచానికి తన సత్తా చాటిందన్నారు.
దిక్కు తోచని పాక్ కాళ్ళ బేరానికి రావడంతో ఇదే అదనుగా తన స్వార్థ ప్రయోజనాల కోసం అమెరికా జోక్యం చేసుకుని
కాల్పుల విరమణకు మనల్ని ఒప్పించిదన్నారు. కాశ్మీర్ భారత్ లో విలీనమైన ప్రాంతమని కాశ్మీర్ అంశంలో ఎవరీ మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇది కేవలం ఇండియా పాకిస్థాన్ ల ద్వైపాక్షిక అంశమన్నారు. పాకిస్థాన్ తో చర్చలంటూ ఉంటే కేవలం పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు తొలగంచటం, పుల్వామా, పహల్గాం లో జరిగిన ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ ను ఎండగట్టడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాంటి అంశాల మీదనే ఇండియా పాకిస్థాన్ ల మధ్య చర్చలు జరగాలని సిమ్లా ఒప్పందం ప్రకారం మూడో దేశం మధ్యవర్తిత్వ జోక్యం అవసరం లేదని అన్నారు. ఇప్పటికే భారత్ పట్ల అమెరికా పెత్తనం చేయాలని స్వార్థ వైఖరి పట్ల భారత్ లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని అన్నారు. మళ్లీ పాకిస్థాన్ మనపై దొంగ చాటుగా దెబ్బ కొట్టే కుయుక్తులు పన్నుతూనే ఉంటుందని పాకిస్థాన్ లో పాలన లేదని ఉగ్రవాదులతో కలిసి సైనిక నియంత పాలన ఉందని జవాబు దారి తనం లేదని అమెరికా మాటలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండి పాకిస్థాన్ కు కోలుకొని గుణపాఠం చెప్పి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మనం చేజిక్కించుకొని మన సత్తా ప్రపంచానికి చాటాలని అప్పుడే భారత్ కు దివ్య భవిష్యత్ ఉంటుందని యావత్ దేశ పౌరులు కోరుతున్నారని పోలాడి రామారావు వెల్లడించారు.






