
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్య కార్డులను ఆపద సమయంలో సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ పురపాలక సంఘం కమిషనర్ కే సమ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ చందులాల్, ఆర్ఎంఓ సుధాకర్ రావుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటే హుజురాబాద్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని కమిషన్ సమ్మయ్య అన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ ఆరోగ్య సంరక్షణ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డులలో కార్మికుల యొక్క అనారోగ్యం, లక్షణాలను కార్మికులు వాడేమందుల సమాచారం పొందుపరిచి ఉంటుందన్నారు. ఈ కార్డులను ప్రతి పరిశుద్ధ కార్మికుడు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, వినయ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రమేష్, జరీనాతో పాటు మున్సిపల్ సానిటరీ జవాన్లు రొంటాల సుధీర్, తూముల కుమార్, ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, అనిల్ కుమార్ తదితర కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.


మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేస్తున్న కమిషనర్ సమ్మయ్య, ఆర్ఎంవో సుధాకర్ రావు..





