Oplus_131072
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ తుమ్మనపల్లి లో పూర్వ విద్యార్థులు స్నేహితునికి తమకు తోచిన ఆర్థిక సహాయం చేసి మేమున్నామని భరోసా ఇచ్చారు. తుమ్మనపల్లి ప్రైమరీ స్కూల్ 1988 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇటీవల జరిగింది. ఈ సందర్బంగా ఆ బ్యాచ్ ఆధ్వర్యంలో తమ తోటి మిత్రుడు టి నరసయ్యకు ఆర్థిక సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం అప్పటి ప్రధాన ఉపాధ్యాయుడు ఎర్రం పాపిరెడ్డి చేతుల మీదుగా తుమ్మనపల్లిలో నరసయ్యకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి ప్రైమరీ స్కూల్ 1988 బ్యాచ్ ఫ్రెండ్స్ నిమ్మల మధుసూదన్ రెడ్డి, బండారి లక్ష్మయ్య, టి సత్తయ్య, జే రమాదేవి, వై రత్నమాల, ఎన్ కొండాల్ రెడ్డి, వై రామ్ రెడ్డి, విమల రెడ్డి, ఎండి అబ్దుల్, గుండా తిరుపతిరెడ్డి, బాణాల శ్రీనివాసరెడ్డి, మల్లికార్జున్, లింగయ్య, నిజాంబాద్ లింగయ్య, స్వరూప, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.






